బంజారాహిల్స్,నవంబర్ 26: రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఘన ంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని డా.బీఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డా.బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.ఏవీఎన్.రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ ప్రొ.ఘంటా చక్రపాణి, గ్రేడ్ డైరెక్టర్ ప్రొ.సుధారాణి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థి సేవల విభాగం డీన్ డా.బానోత్లాల్, డైరెక్టర్ డా.ఎల్వీకే.రెడ్డి, డా.వడ్డాణం శ్రీనివాస్, డా.పరాంకుశం వెంకటరమణ, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డా.బోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని జ్ఞానీజైల్‌సింగ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్, మాదాసి కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌కుమార్ పాల్గొని డా.బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. ఫిలింనగర్‌లోని శంకర్ విలాస్ చౌరస్తావద్ద డా.బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి టీఆర్ఎస్ ఎస్సీసెల్ నాయకులు, వివిధ కులసంఘాల నాయకులు నివాళులరించారు. కార్యక్రమంలో దాసు, నగేశ్సాగర్,వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
హిమాయత్‌నగర్,నవంబర్ 26: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బీఆర్ అంబేద్కర్ రచించిన రా జ్యాంగం రక్షణ కవచంలాగ నిలుస్తోందని హిమాయత్‌నగర్ డివిజన్ టీఆర్ఎస్(బీఆర్ఎస్) అధ్యక్షుడు యాదగిరి సుతారి అన్నారు. హిమాయత్‌నగర్ వై జంక్షన్లో అంబే ద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. నాయకులు పాలడుగు శ్రీనాథ్, నందు, కొల్కుల శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, బీజేపీ నాయకులు పందిర్ల ప్రసాద్, నవీన్, వెంకటేశ్ పాల్గొన్నారు.