కాంగ్రెస్‌కు దళితులు బుద్ధి చెప్పాలి
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించి, అందుబాటులోకి తెచ్చిన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్‌ను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్‌లో ఓడించి బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.
- సీడీఎస్‌ను సందర్శించిన బీఆర్ఎస్ దళిత నేతలు
సిటీ బ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించి, అందుబాటులోకి తెచ్చిన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్‌ను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్‌లో ఓడించి బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్‌నగర్‌లోని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనాన్ని శుక్రవారం కొప్పులతోపాటు మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు బాల సుమన్, దుర్గం చిన్నయ్య, రవిశంకర్, రసమయి బాలకిషన్, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, మేడే రాజీవ్ సాగర్ సందర్శించారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన వసతులను పరిశీలించారు.
కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ‘కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు దళితులు, గిరిజనుల సమస్యలను అధ్యయనం చేసే పరిశోధనలు జరగాలనే ఉద్దేశంతో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్‌ను ప్రారంభించారన్నారు. కేసీఆర్ రూ.24 వేల కోట్లతో భవన నిర్మాణం, రూ.12 కోట్లతో వసతులు కల్పించారని చెప్పారు. దీనిపై ఒక్క రివ్యూ చేయని సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఒక్కో డివిజన్‌కు ముగ్గురి చొప్పున మంత్రులను నియమించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేదర్ అభయ హస్తం పేరిట రూ.12 లక్షలు ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. 59 దళిత ఉప కులాలన్నింటినీ కలిపి మూడు కార్పొరేషన్లు పెట్టి, ఒకో కార్పొరేషన్‌కు రూ.750 కోట్లు కేటాయిస్తామని మాట తప్పిందని ఆరోపించారు.
దళితులను నట్టేట ముంచిన కాంగ్రెస్: రాజయ్య
23 నెలల కాంగ్రెస్ పాలనలో దళితులకిచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా నట్టేటా ముంచింది. తెలంగాణలోని 18 లక్షల దళిత కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధి ఫలాలు అందించారు. దళితులను మేధావులను చేయాలని కేసీఆర్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కోసం రూ.36 కోట్లను ఖర్చు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను ఓడించి రేవంత్‌రెడ్డికి దళితుల సత్తా ఏంటో చూపిద్దాం.
కాంగ్రెస్‌ను ఓడిద్దాం: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వంతపాడుతున్న ఎంఐఎంకు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడించి ఆ రెండు పార్టీలకు చెంప పెట్టులాంటి తీర్పునివ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద పుస్తకాలు పెట్టడానికి డబ్బులు లేవా? దళిత సామాజికవర్గంలో పుట్టిన భట్టి విక్రమార్కకు దళితులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
అంబేద్కర్‌కు అవమానం: బాల్క సుమన్
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అడుగడుగునా అవమానించారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సచివాలయానికి ఆయన పేరు పెట్టి సముచిత స్థానం కల్పించారు. అంబేద్కర్‌ను అడుగడగునా అవమానాలకు గురిచేసింది. అందుకే జూబ్లీహిల్స్ దళితులు కాంగ్రెస్‌ను ఓడించి బుద్ధి చెప్పాలి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IMD Weather | ఈ నెలలోనూ ఎండలెక్కువే..! చలి తీవ్రత పెరగాల్సిన సమయంలో భిన్న వాతావరణం
Omar Abdullah | జమ్ము కశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి.. నలుగురు మంత్రులు, సీఎం సలహాదారును తొలగించాలని డిమాండ్
Illegal Egg Donation | ఒక్కో అండం రూ. 3 లక్షలు..! డబ్బు ఆశ చూపి వ్యాపారం.. హాస్టళ్ల ముసుగులో దందా
Narsingi Big Road | ఒక్క బిల్డర్ కోసం మాపై బుల్డోజరా?.. ప్రభుత్వం తీరుపై భగ్గుమన్న ‘బిగ్’ రోడ్ బాధితులు
IDBI Bank | అగ్గువకు ఐడీబీఐ..! నిరుడు బ్యాంక్ లాభం 10 వేల కోట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

