ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 6 : ఉస్మానియా యూనివర్సిటీ బోటనీ విభాగంలో బుధవారం నుంచి మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు జరుగనుంది. విభాగం శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ‘అడ్వాన్సెస్ ఇన్ ప్లాంట్ సైన్సెస్ ఫర్ సస్టెయినబుల్ ఫ్యూచర్’అనే అంశంపై నిర్వహించనున్నట్లు సదస్సు కన్వీనర్లు ప్రొఫెసర్ బి.రమాదేవి, కన్వీనర్ ప్రొఫెసర్ సబితారాణి తెలిపారు.
సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయ భవనంలోని కాన్ఫరెన్స్ హాలులో ఉదయం పది గంటలకు సదస్సు ప్రారంభం కానుందని చెప్పారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ములుగు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ డీన్, ఐఎఫ్ఎస్ అధికారి ప్రియాంక వర్గీస్ హాజరుకానున్నారని, ఇక్రిసాట్ గ్లోబల్ రీసర్చ్ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ సీన్ మాయెస్ కీలకోపన్యాసం చేయనున్నారు.