CDFD | సిటీబ్యూరో, జూన్ 21(నమస్తే తెలంగాణ) : సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్‌లో రీసెర్చ్ టాక్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా లైఫ్ సైన్సెస్ రంగంలో జరుగుతున్న పరిశోధనలను విస్తృతం చేసేలా ప్రతి నెలా నిపుణుల బృందం ప్రత్యేక చర్చాగోష్టిని ఏర్పాటు చేస్తున్నది.
శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ రీసెర్చ్ టాక్ కార్యక్రమంలో సీడీఎఫ్‌డీ డైరెక్టర్ ఉల్లాస్ కొల్తూర్ ‘ప్లాస్టిసిటీ అండ్ మెమొరీ ఫ్రం మాలిక్యూలస్ టూ ఫిజియోలాజీ’ అంశంపై ప్రసంగించారు. మానవ ఆరోగ్య సంరక్షణలో బయాలజీ పరిశోధనలు అత్యంత కీలకంగా మారుతున్నాయని అభిప్రాయపడ్డారు.