Hyderabad | బోర్డు మీద లెక్కలు చెప్తున్న ఈ సార్‌ను గుర్తుపట్టారా ? అవును.. కలెక్టర్ సారే. గురువారం బంజారాహిల్స్‌లోని ఎన్బీటీ నగర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు ఇలా గణితంపై ప్రత్యేక తరగతులు తీసుకున్నారు.
ఆయన వెంట జిల్లా విద్యాధికారిని ఆర్ రోహిణి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి యాదయ్య, సికింద్రాబాద్ ఆర్డీవో రవికుమార్, సంబంధిత అధికారులు ఉన్నారు.
– సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ)