దుండిగల్, ఆగస్టు 25 : సీఎం సహాయనిధి ఎంతో మంది నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు శంభీపూర్‌రాజు అన్నా రు. గురువారం దుండిగల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన ఎ.కృష్ణ, బి.హరీశ్‌లు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా, వారికి మెరుగైన చికిత్స కోసం రూ.3.50 లక్షల విలువ చేసే ఎల్ఓసీ పత్రాలను అందించారు. కార్యక్రమంలో దుండిగల్ వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు శంభీపూ ర్ క్రిష్ణ, గోపాల్‌రెడ్డి, ఆనంద్‌కుమార్, సాయియాదవ్, జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ సురేశ్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
పలు సమస్యలపై వినతులు..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలు సం ఘాలు, సంక్షేమ కాలనీల ప్రతినిధులు ఎమ్మెల్సీ శంభీపూ ర్ రాజును కలిసి.. పలు సమస్యలపై వినతిపత్రాలను అందించారు. ఎమ్మెల్సీ .. సంబంధిత ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి.. వారి సమస్యలను పరిష్కరిం చాలని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ, బౌరంపేట్ పీఏసీఎస్ డైరెక్టర్ కిష్టయ్య, నాయకులు బైండ్ల గోపాల్, బాలకృష్ణ, రమేశ్, పోచయ్య, యాదయ్య, నారాయణ, గోపాల్, సురేశ్, తదితరులు పాల్గొన్నారు.