ఘట్కేసర్,డిసెంబర్29: రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల అభివృద్ధ్దికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.బుధవాం పోచారం మున్సిపాలిటీ చైర్మన్ బి.కొం డల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యంనంపేట్‌లోని శ్రీరంగనాయక స్వామి ఆలయ అభివృద్ధి నూతన కమి టీ సభ్యుల ప్రమాణ స్వీకారానికి మంత్రి హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం రూ.100 కోట్లను ప్రభుత్వం కేటాయించి పలు ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేస్తున్నదని అన్నారు. నియోజకవర్గంలో దేవాదాయ శాఖ గుర్తించిన 17 ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటి వరకు 7కోట్ల,50 లక్షల రూపాయలను మంజూరు చేసిందని, ఒక్కో ఆలయానికి రూ.50లక్షల చొప్పన ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు.
మిగతా మొత్తాన్ని దశల వారీగా ఆలయ ఖాతా ల్లో ప్రభుత్వం జమ చేయనున్నదని వివరించారు. అంతకు మందు ఆలయంలో మంత్రి మల్లారెడ్డి స్థానిక నాయకులు,నూతన కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్, డైరెక్టర్లు రవీందర్,నరేందర్,కె.లక్ష్మణ్ నాయక్,ఎన్. నిర్మలా రాంచంద్రారెడ్డి చేత ఆలయ ఈఓ భాగ్యలక్ష్మి ప్రమాణ స్వీకారం చేయించగా, మంత్రి మల్లారెడ్డి శాలువా కప్పి సన్మానించారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి,ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎం.పావని జంగయ్య యాదవ్,ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి,మేయర్ వెంకట్‌రెడ్డి,వైస్ చైర్మన్ రెడ్యానాయక్, టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకుడు భద్రారెడ్డి, కౌన్సిలర్లు,సర్పంచ్‌లు,ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. అంతకుముందు పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ సూర్య యూత్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు.