సికింద్రాబాద్ : అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసిన కారణజన్ముడు కేసీఆర్ అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంగళవారం కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సాయన్న నేతృత్వంలో పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
నియోజకవర్గంలోని న్యూ బోయిన్‌పల్లిలోని బాపూజీనగర్, కార్కానా మడ్‌ఫోర్ట్ అంబేద్కర్ హాట్స్, తిరుమలగిరి లోని మహాంకాళి ఆలయం, బొల్లారం, రసూల్‌పురాలోని ఇందిరమ్మనగర్లలో టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్‌రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే సాయన్న అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు.
అన్నదాన కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ (ఎంఎస్ఐడీసీ) చైర్మన్ ఎరోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

సికింద్రాబాద్ పరిధిలో……
సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని సీతాఫల్మండి డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సామల హేమ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారవుగౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందన్నారు.
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం కార్పొరేటర్ హేమ డివిజన్లోని ఎస్ఎల్ వృద్దాశ్రమంలో అన్నదానంతో పాటు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నేతలు కిషోర్‌కుమార్, రామేశ్వర్గౌడ్తో పాటు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ…
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మెట్టుగూడ డివిజన్లోని సెయింట్ అంథోనీస్ చర్చిలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, టీటీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డిలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం నిరుపేదలకు దుస్తులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకు పోతోందన్నారు. కార్యక్రమంలో మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ సునిత, టీఆర్ఎస్ నేతలు నర్సింగ్‌రావు, వెంకటేశ్, శ్రీకాంత్, కృష్ణ, హరి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
