Hyderabad | సిటీబ్యూరో, ఏప్రిల్ 16 ( నమస్తే తెలంగాణ): అందంగా కనిపించడం కోసం ఎంత డబ్బైన ఖర్చు పెట్టడానికి నగరవాసులు వెనకాడటం లేదు. సోషల్ మీడియా వేదికగా సినిమా, సిరీస్‌లు, షార్ట్‌ఫిల్మ్‌లు, యాంకర్లు తదితర రంగాల్లోనూ అవకాశాలు దక్కుతుండటంతో ప్రత్యేక లుక్ కోసం పాకులాడుతున్నారు.
ఈ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని సెలూన్స్ సైతం సౌందర్య సంరక్షణకు అంతర్జాతీయ ప్రమాణాలు జోడిస్తున్నాయి. రంగు ఏదైనా సెలబ్రెటీలుగా తీర్చిదిద్దడానికి విభిన్న రకాల సేవలను అందుబాటులో ఉంచారు. ఇదే క్రమంలో గ్రేటర్లో విస్తృతంగా ట్రెండింగ్ సెలూన్స్ వెలుస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ప్రతీ వీకెండ్‌కు ఫ్యామిలీ అంతా సెలూన్‌కు వెళ్లి సౌందర్యానికి మెరుగులు దిద్దుకుంటున్నారు. ఇతరులకు ఆకర్షణీయంగా కనిపించేందుకు తహతహలాడుతున్నారు.
అలంకరణ మీద ఒక కుటుంబం(నలుగురు సభ్యులు) సుమారుగా నెలకు రూ.20వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా హెయిర్ కేర్, స్కిన్, బాడీ కేర్, హెయిర్ కలరింగ్, గ్రూమింగ్, స్పా, హెయిర్ స్పా, నెయిల్ ఆర్ట్, హెయిర్. స్టెలింగ్, మానిక్యుర్, మేకప్, డెటన్, పెడిక్యూర్, మెనిక్యూర్,ప్రీమియం ఫేషియల్స్, ఫేషియల్స్, క్లిన్అప్స్, హెయిర్ ఫార్మ్స్, వెల్ల హెయిర్ స్పా తదితర సేవలకు భారీగా డిమాండ్ ఏర్పడింది.
అత్యాధునికంగా..!!
ఇంటర్నేషనల్ జ్యూసీ సెలూన్, హబీబ్ లాంటి సెలూన్ బ్రాంచీలు నగరంలో మరిన్ని ప్రారంభమయ్యాయి. వీటి సరసన ఇంకొన్ని అత్యాధునిక సెలూన్స్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఏసీ గదులు, ఇంటీరియర్ డిజైన్స్, పూల మొక్కలు, విశాలమైన గదులు ఇలా అన్ని రకాలుగా ఆకట్టుకునేల సెలూన్స్‌ను తీర్చిదిద్దుతున్నారు. వెయిటింగ్ కస్టమర్లకు బోర్ కలగకుండా మ్యాగ్జిన్స్, టీవీ, పజిల్స్ లాంటి సేవలను అందిస్తున్నారు.
కుటుంబ సమేతంగా వెళ్లి ఆహ్లాదంగా సెలూన్ సేవలను పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్నిచోట్ల ధరలు కూడా మెనూలో పొందుపర్చి సేవలను అందిస్తున్నారు. హెయిర్ కలరింగ్‌లో అమోనియా ఫ్రీకి రూ.1000, ఫ్యాషన్ కలర్‌కు రూ. 1200, క్రిస్టల్ పెడిక్యూర్కు రూ.1000, హీల్ పీల్‌కు రూ.1500 ఉన్నాయి. అయితే ఫేషియల్స్‌లో మాత్రం ధరలు అధికంగా ఉన్నాయి. రేడియంట్ ఫేషియల్కు రూ.3,500, గ్లోకు రూ.3,500, ఆక్సిజన్ ఫేషియల్కు రూ.4,500, టెక్నికల్ సర్వీసెస్‌లో స్రెయిటనింగ్ ధరలు రూ.3 వేల నుంచి రూ.12వేల వరకు తీసుకుంటున్నారు.
సోషల్ మీడియా వేదికగా..
నగరంలోని మెజార్టీ ప్రజలు, ఇన్ఫ్లూయెన్సర్లు తమ సౌందర్యాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తున్నారు. అందంగా తయారై ఫొటోలు దిగి ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్‌స్టాలో షేర్ చేయడమనే ఆసక్తి విరివిగా పెరిగింది. ఒక్కో ఫొటోలో ఒక్కో లుక్ ఉండేలా అలంకరణపై దృష్టి పెడుతున్నారు. లైక్స్, కామెంట్స్ వచ్చేలా ట్రెండీ లుక్స్‌ను ఆశ్రయిస్తున్నారు. అలాగే బ్యూటీప్రొడక్ట్స్ను ఆన్లైన్లో ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరిగింది. సినిమాల్లో హీరోలను అనుసరిస్తూ గ్రూమింగ్ ఫాలో అవుతున్న వారూ ఉన్నారు. ఆత్మవిశ్వాసంగా కనిపించడంలోనూ అలంకరణ ప్రధాన పాత్ర పోషిస్తోంది.
కెరీర్లోనూ అలంకరణ కీలకమైంది
ఇది వరకు చాలా కంపెనీలు పనిలో నైపుణ్యం, ప్రతిభను పరిగణలోకి తీసుకునేవి. మారిన పరిస్థితుల్లో ఎన్నో రంగాల్లో ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం నైపుణ్యం, ప్రతిభతో పాటు అందంగా కనిపించడం కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. వినియోగదారులతో నేరుగా సంబంధాలు ఉండే కొలువుల్లో చక్కగా సిద్ధం కావడం, రోజంతా హుషారుగా ఉండటం అదనపు అర్హతగా భావిస్తున్నారు. ఇప్పుడు అలంకరణ అనేది జీవితంలో ఒక భాగమైపోయింది.
– శ్రావ్యరెడ్డి, ఫౌండర్, ఇంటర్నేషనల్ జ్యూసి సెలూన్ సెంటర్
పురుషుల్లోనూ శ్రద్ధ పెరిగింది
ఈరోజు అలంకరణ అనేది అమ్మాయిలకే పరిమితం కాలేదు. మహిళలతో సమానంగా ట్రెండీ ైస్టెల్‌గా కనిపించేందుకు పురుషులు కూడా ఇష్టపడుతున్నారు. రోజువారీ, పండుగలు, వేడుకల్లోనూ ఆ మార్పు ఇటీవల కాలంలో ప్రతిబింబిస్తోంది. కుర్రకారుతో పోటీ పడేందుకు యువకులుగా కనపించేందుకు 40ఏండ్లు పైబడిన వారు కూడా అధిక ఆసక్తి చూపిస్తున్నారు.
– సునీత, బ్యూటీషియన్