Hyderabad | వెంగళరావునగర్ : మద్యం మత్తులో నడిరోడ్డుపై వీరంగం సృష్టించిన ఓ సినీ ఆర్టిస్టుపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమాల్లో మూవీ ఆర్టిస్టుగా పని చేస్తున్న ఓ యువతి పీకల దాకా మద్యం సేవించి.. ఆదివారం రాత్రి మధురానగర్ నడిరోడ్డుపై హంగామా చేసింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న చరణ్ అనే వ్యక్తిని దుర్భషలాడింది. అటుగా వెళ్లే వారిని వదలకుండా బూతులతో రెచ్చిపోయింది. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులను కూడా నానా మాటలంటూ వీరంగం సృష్టించింది. అడ్డుకునేందుకు యత్నించిన ఓ మహిళా హోంగార్డుపై కూడా దాడి చేసింది. దీంతో విసిగిపోయిన పోలీసులు సదరు మహిళ భర్తకు ఫోన్ చేసి ఘటనాస్థలానికి పిలిపించారు. ఆమెను ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మద్యం మత్తులో యువతి హల్చల్
మందేసిన మైకంలో నడిరోడ్డుపై చిందేసి.. తాగి ఊగి నడి రోడ్డుపై తైతక్కలాడిన యువతి
మధురానగర్లో నడి రోడ్డుపై పోలీసులకు చుక్కలు చూపించిన మూవీ ఆర్టిస్ట్ మేకల సరిత
మద్యం తలకెక్కిన మైకంలో చరణ్ అనే వ్యక్తిని దుర్భాషలాడి.. అటుగా వెళ్ళేవారిని వదలకుండా… pic.twitter.com/XubitF47Vn
— Telugu Scribe (@TeluguScribe) February 25, 2025