దుండిగల్, అక్టోబర్31: పాఠశాలలు, కళాశాలల్లో విలువలతో కూడిన విద్యను అందించాలని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. ఆదివారం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని బాచుపల్లిలో గోకరాజు లైలావతి ఉమెన్స్ ఇంజినీరింగ్ మహిళా కళాశాల, గాంజెస్ వాలీ స్కూల్ చిన్నపిల్లల వసతి సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ కళాశాలలో మహిళా సాధికారిత దిశగా యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలన్నారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి ప్రపంచీకరణ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యంతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు.