ప్రపంచ ఆర్థికగతిని మార్చాలి
ప్రతి అవకాశాన్ని యువ శాస్త్రవేత్తలు వినియోగించుకుంటూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు దోహదపడాలని కళాశాల, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు.
- కళాశాల, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్
ఘట్కేసర్ రూరల్, మార్చి 9: ప్రతి అవకాశాన్ని యువ శాస్త్రవేత్తలు వినియోగించుకుంటూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు దోహదపడాలని కళాశాల, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్‌మిట్టల్ తెలిపారు. ఘట్కేసర్ మండల పరిధి వెంకటాపూర్‌లోని అనురాగ్ యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన ‘ఈ టెక్నో ఫెస్ట్ దక్ష-2023’ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నేటి సమాజంలో సృజనాత్మకత, ఆవిష్కరణల ప్రాముఖ్యం ఎంతో పెరిగిందన్నారు. డీఎంఆర్ఎల్ మాజీ డైరెక్టర్ జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు.
పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు సరైన వేదికను ఎంచుకోవాలన్నారు. 175 ఈవెంట్లతో కూడిన ఈ ఫెస్ట్‌కు వివిధ రాష్ర్టాల నుంచి 3,727 రిజిస్ట్రేషన్లు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ గ్లోబల్ డెలివరీ-క్లౌడ్ అండ్ ఇన్ప్రాస్ట్రక్చర్ సర్వీసెస్ జనరల్ మేనేజర్ కె.సురేందర్ రెడ్డి, యూనివర్సిటీ సీఈవో సూర్యదేవర నీలిమ, వైస్‌చాన్స్‌లర్ రామచంద్రం, రిజిస్ట్రార్ సమీన్ ఫాతిమా, కన్వీనర్ అనిల్ కుమార్, కో కన్వీనర్ రవికాంత్ రాజు, అన్ని విభాగాల డీన్లు, హెచ్వోడీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- economy
- global economy
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

