సిటీబ్యూరో, నవంబర్ 16(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సిటీ పోలీసులు రెండు రోజులుగా నిర్వహించిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 457మంది మద్యం తాగినట్లు గుర్తించారు. 14,15 తేదీల్లో పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో 377 మంది టూవీలర్, 27మంది త్రీవీలర్, 53 మంది ఫోర్‌వీలర్ వాహనదారులు ఉన్నారని వారు పేర్కొన్నారు. అందరిపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.