మియాపూర్, మే 1: మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీ భవన నిర్మాణాల వద్ద విలువైన సామగ్రి దొంగతనం చేస్తున్న ఏడుగురు నిందితుల(ముఠా)ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. సైదాబాద్‌లోని సింగరేణి కాలనీకి చెందిన మూడవ పద్మ(35), నేనావత్ విజయ దధి, బిల్లావత్ లక్ష్మి(40), నినావత్ అమృత(25), సభావత్ సునీత(28), వదిత్య అనిత(22), నినావత్ చందర్(26)లు ఓ ముఠాగా ఏర్పడి భారీ భవన నిర్మాణ సముదాయాల వద్ద విలువైన వస్తువులు సెంట్రింగ్ సామగ్రి రాత్రివేళలో దొంగతనాలకు పాల్పడుతున్నారు.
ఈ క్రమంలో మియాపూర్‌లోని ఓ భారీ నిర్మాణ సంస్థ వద్ద గత నెల 19వ తేదీన అర్థరాత్రి సెంట్రింగ్ దొంగతనాలకు పాల్పడ్డారు. అక్కడ నిర్మాణ యజమాని మరుసటి రోజు ఉదయం భవనం వద్దకు వెళ్లి చూడగా.. అల్యూమినియం సెంట్రింగ్ సామగ్రి కనిపించలేదు. ఏడు లక్షల విలువజేసే అల్యూమినియం సెంట్రింగ్ సామగ్రి కనిపించకపోవడంతో యజమాని 20వ తేదీన మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు సమీపంలో సీసీ కెమెరాలను పరిశీలించగా.. మహిళలు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో పద్మ, విజయలక్ష్మి, అమృత, సునీత, ఆటో డ్రైవర్ చందర్‌లను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా.. భవన నిర్మాణాల వద్ద విలువైన వస్తువులు, సెంట్రింగ్ సామగ్రిని దొంగతనానికి పాల్పడింది తామేనని అంగీకరించారు. దీంతో మియాపూర్ పోలీసులు వారి వద్ద నుంచి రూ.7లక్షల అల్యూమినియం సెంట్రింగ్ సామన్లు స్వాధీనం చేసుకుని దొంగతనాలకు ఉపయోగిస్తున్న రెండు ఆటోలను స్వాధీనం చేసుకుని ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.