అబిడ్స్, జూన్ 17: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని విధాలా అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ పార్టీ యువ నేత పంకజ్ షిండే అన్నారు. పాతబస్తీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ యువ నేత శ్రీ ఓంకార్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు పంకజ్ షిండే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు.
కేసీఆర్ను ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పంకజ్ షిండే కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా పంకజ్ షిండే మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు పాటు పడ్తానని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను చేపట్టడం జరిగిందన్నారు. తెలిపారు.