గౌతంనగర్, ఏప్రిల్ 27 : ప్రజల మనసులో బీఆర్ఎస్ పార్టీ నిండుగా ఉందని, బీఆర్ఎస్కే ఓటు వేసి రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆదేశాల మేరకు గురువారం సాయినగర్‌లోని కార్యాలయంలో కార్పొరేటర్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించా రు. ఈ సందర్భం గా కేక్ కట్‌చేసి అందరికీ పంచారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ .. తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకువచ్చి, అన్ని విధాలా అభివృద్ధి చేశారని, ప్రజలు బీఆర్ఎస్వైపే ఉన్నారని తెలిపారు.
కేసీఆర్ చేసిన అభివృద్ధి , సంక్షేమానికి ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్కే ఓటు వేసి రుణం తీర్చుకుంటారన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత మల్కాజిగిరిలో జరిగిన అభివృద్ధి కండ్లకు కట్టినట్టు కనపడుతుందన్నారు. కార్యకర్తలకు, పార్టీ నాయకులకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని తెలిపారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావ డం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మేకల రాముయాదవ్, ఉద్యమకారులు, నా యకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.