MLC Kavitha | చంపాపేట, ఏప్రిల్ 12 : హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ చంపాపేట డివిజన్ పరిధి కర్మన్‌ఘాట్‌లోని ధ్యానాంజనేయ స్వామిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అంజన్న స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి ఆమె హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారిని ఆలయ ఈవో ఎన్.లావణ్య అధికారికంగా వాయిద్య మేళాలతో ఆహ్వానించారు. అంజన్న దర్శనానంతరం ఆలయ వేద పండితులు అభిషేకాలు, అర్చనలు చేసి వారికి స్వామివారి శేష వస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ చేగోని సుదర్శన్ గౌడ్, మాజీ ధర్మకర్తలు మధు సాగర్, బీసుకుంట్ల సతీశ్ గౌడ్, కిరణ్ కుమార్ గుప్తా, చెలమల యాదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.