ముషీరాబాద్: కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బుధవారం అడిక్మెట్ డివిజన్ లలితానగర్ కమ్యూనిటీహాల్లో దీక్షా దివస్ సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 29న రాంనగర్ చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు.