సిటీ బ్యూరో, నవంబర్ 25(నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ సర్వ సభ్య సమావేశం జరగనుంది. ఈమేరకు సర్వసభ్య సమావేశంతో పాటు దీక్షా దివస్ ఏర్పాట్లపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని పరిశీలించనున్నట్లు తలసాని తెలిపారు. సమావేశానికి సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని స్థాయిల నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు.