ఖైరతాబాద్, డిసెంబర్ 19 : తాను మరణిస్తూ నలుగురికి కొత్త జీవితాన్నందించాడు ఆ యువకుడు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా వెలగటోడుకు చెందిన పసల వీర వెంకట వరప్రసాద్ (28) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని సన్‌షైన్ ఆస్పత్రిలో చేర్చారు.
చికిత్స అందిస్తున్న వైద్యులు ఆదివారం బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. కుటుంబసభ్యులను జీవన్‌దాన్ ప్రతినిధులు కలిసి అవయవదానం విశిష్టతను వివరించగా వారు అంగీకరించారు. అతడి శరీరం నుంచి కాలేయం, గుండె, రెండు మూత్రపిండాలను సేకరించారు. అవసరమైన వారికి అవయవాలను అందజేస్తామని వైద్యులు తెలిపారు.