Brahma Kamalam | షాద్నగర్ టౌన్, జూలై 20: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో బ్రహ్మకమలం వికసించింది. సిమ్లానగర్ కాలనీకి చెందిన కొనియాల అరుణ భాస్కర్ ఇంటి ఆవరణలో శనివారం రాత్రి ఈ బ్రహ్మకమలం పూసింది. ఈ సందర్భంగా దానికి ప్రత్యేక పూజలు చేశారు.
బ్రహ్మకమలం హిమాలయ పర్వతాలు, శీతల ప్రదేశాల్లో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వికసిస్తుంది. అలాంటి బ్రహ్మకమలం తమ ఇంటి ఆవరణలో వికసించడం పట్ల కొనియాల అరుణ భాస్కర్ కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. బ్రహ్మకమలం వికసించడంతో సుగంధపు వాసన వెదజల్లిందని, వికసించిన బ్రహ్మకమలాన్ని స్థానికులు చూడటానికి ఆసక్తి చూపారు. అదే విధంగా పట్టణంలోని పలువురి ఇంట్లో బ్రహ్మకమలాలు విరబూశాయి.