పీర్జాదిగూడ మార్చి 16: క్రికెట్ బాల్ కొనుక్కోవడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బాలుడు మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ మండలం కాచవాన సింగారం గ్రామం పరిధిలోని కాంతి దీపి కాలనీలో నివాసం ఉంటున్న పరై గోపి కుమారుడు అక్షిత్( 13) స్థానికంగా ఓ ప్రైవేట్ కళాశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు.
ఆదివారం సెలవు కావడంతో తన పెదనాన్న కొడుకు అభిలాష్ తో కలిసి క్రికెట్ బాల్ కొనుక్కోవడానికి స్కూటీపై పర్వతాపురం వైపు వెళుతుండగా పోచమ్మ గుడి సమీపంలోకి రాగానే ఎదురుగా దూసుకు వస్తున్న ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కింద పడిపోయారు. వెనకాల కూర్చున్న అక్షిత్ బస్సు ముందు టైర్ కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..