బీఎల్వోల నిర్లక్ష్యం.. డిజిటలైజేషన్ ఆలస్యం
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఓటర్ల వివరాలను ఆన్లైన్ చేసే ప్రక్రియ మరింత ఆలస్యమవుతున్నది. ఇప్పటికే దాదాపు 70 శాతం మంది ఓటర్లు తమ వివరాలు నమోదు చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలకు అందజేసినా డిజిటలైజేషన్ మాత్రం మందకొడిగా సాగుతున్నది.
సిటీ బ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఓటర్ల వివరాలను ఆన్లైన్ చేసే ప్రక్రియ మరింత ఆలస్యమవుతున్నది. ఇప్పటికే దాదాపు 70 శాతం మంది ఓటర్లు తమ వివరాలు నమోదు చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలకు అందజేసినా డిజిటలైజేషన్ మాత్రం మందకొడిగా సాగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో మంగళవారం నాటికి డిజిటలీకరణ 43 శాతం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 42 శాతం, రంగారెడ్డి జిల్లాలో 52శాతం పూర్తయ్యింది.
గ్రామీణ జిల్లాల్లో ఇది ఇప్పటికే 70 నుంచి 80 శాతానికి చేరింది. విద్యావంతులు ఎక్కువగా ఉన్న గ్రేటర్ పరిధిలో డిజిటలైజేషన్ ఇంకా 50 శాతం దగ్గరే ఉండటానికి ప్రధాన కారణం బీఎల్వోల నిర్లక్ష్యమేనని తెలుస్తున్నది. ఫారాల పంపిణీ క్షేత్రస్థాయిలో చేయకపోయినా కనీసం ఓటర్లు తీసుకొచ్చి ఇచ్చిన వాటిని ఆన్లైన్ చేయడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా చాలామంది బీఎల్వోలకు యాప్ నిర్వహణ ఇప్పటిదాకా తెలియకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి బీఎల్వోల తీరును పర్యవేక్షించాలని.. వివరాలు పకడ్బందీగా నమోదు చేస్తూ అసలైన ఓట్లు గల్లంతు కాకుండా చూడాలని ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

