సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ఈవ్‌టీజింగ్, మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న పలువురిని రాచకొండ షీ టీమ్స్ అరెస్ట్ చేసింది. యువతులు, మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఇద్దరు నిందితులతోపాటు 162 మంది పోకిరీలను షీ టీమ్స్ పట్టుకుందని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపా రు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఎప్పుడు ముం దుంటుందని, బాధితులు ధైర్యంగా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. పట్టుబడ్డ ఈవ్‌టీజర్లకు రాచకొండ కమిషనర్ క్యాంప్ కార్యాలయం లో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సీపీ తెలిపారు. షీ టీమ్స్‌కు నేరుగా 75 మంది, సోషల్‌మీడియా ద్వారా 69, ఫోన్ల ద్వారా 36 ఫిర్యాదులు అందాయని, అందులో ఐదుగురిపై క్రిమినల్ కేసులు, 68 పెట్టీ కేసులు, 92 మందికి రాచకొండ మహిళా సేఫ్టీ డీసీపీ ఉషా విశ్వ నాథన్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు వెల్లడించారు.
బ్లాక్‌మెయిలర్లు అరెస్ట్
ఓ మహిళ భర్త ఈవెంట్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతని వద్ద పనిచేస్తున్న వ్యక్తి వద్ద ఈవెంట్స్‌కు సంబంధించిన డబ్బులు ఉండగా అవి ఇవ్వాలని మేనేజర్ భార్య కోరింది. తాను ఆ డబ్బు ఇవ్వనని, ఏమి చేసుకుంటావో చేసుకో.. నీ ఫొటోలు నా వద్ద ఉన్నాయి.. అంటూ ఆమె కూతురితో ఉన్న ఫొటోను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నా డు. దీంతో బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. మరో ఘటనలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న యువతికి నాలుగేండ్ల క్రితం ఓ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. ఆమెను ప్రేమిస్తున్నా నంటూ వెంటపడగా నిరాకరించింది. దీంతో ఆమె ఫొటోలు మా ర్ఫింగ్ చేసి, శారీరక సంబంధం పెట్టుకోవాలని, గుంటూరులోని తన రూమ్మేట్ వద్దకు రావాలని, లేదంటే ఫొటోలు మీ కుటుంబ సభ్యులకు పంపిస్తానంటూ బ్లాక్‌మెయిలింగ్ చేస్తుండడంతో బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.