అబిడ్స్, జనవరి 19: గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎం ఆనంద్‌కుమార్ గౌడ్‌పై బీజేపీ నాయకులు దాడికి పా ల్పడ్డారు. గోషామహల్ పోలీసుల కథనం ప్రకా రం.. బేగంబజార్ ఫిష్ మార్కెట్ వద్ద ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన ఆనంద్‌కుమార్ గౌడ్‌ను బీజేపీ నాయకులు సుధీర్‌సింగ్ అడ్డుపడి ‘ఇక్కడ నీకు ఏం పని’ అని వాగ్వివాదానికి దిగారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు వచ్చానని ఆనంద్‌కుమార్ గౌడ్ సమాధానం ఇచ్చారు. అదే సమయంలో బేగంబజార్ కార్పొరేటర్ జి శంకర్ యాదవ్, మంగళ్‌హాట్ డివిజన్ కార్పొరేటర్ ఎం శశికళ భర్త కృష్ణ వచ్చి ఆనంద్‌కుమార్ గౌడ్‌తో వాగ్వాదానికి దిగడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించారు. చేయి చేసుకోవడంతో ఆనంద్‌కుమార్ గౌడ్ కంటి అద్దం తగిలి కంటి కింద గాయమైంది.
ఆనంద్‌కుమార్ గౌడ్ వెంటనే గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తనపై దాడి జరిగిందని, దాగికి దిగిన వారిని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం అందుకున్న గోషామహల్ ఏసీపీ సుదర్శన్ ఆనంద్‌కుమార్ గౌడ్‌ను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు ఆర్ శంకర్‌లాల్ యాదవ్, సురేశ్ ముదిరాజ్, ప్రదీప్ రాజ్, భూపేందర్, టింకు, ప్రియాగుప్తా తదితరులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
గోషామహల్ అదనపు ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, ఎస్ఐ అరుణోదయ ఆనంద్‌కుమార్ గౌడ్‌ను సముదాయించే ప్రయత్నం చేసినా.. వినక పోవడంతో గోషామహల్ ఏసీపీ సుదర్శన్ వారిని సముదాయించి అక్కడి నుంచి పంపించి వేశారు. కాగా, ఆనంద్‌కుమార్ గౌడ్‌పై దాడి జరిగిన విషయం తెలుసుకున్న కార్వాన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఉస్మాన్బిన్ హజారి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆనంద్‌కుమార్ గౌడ్‌కు సంఘీభావాన్ని తెలిపారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిరంతరం పోరాడుతా: ఆనంద్‌కుమార్ గౌడ్
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎం ఆనంద్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఎవరికీ భయపడేది లేదని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతానన్నారు. బేగంబజార్ మచ్చి మార్కెట్ వద్ద సమస్యలు ఉన్నాయని స్థానిక ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాను పర్యటిస్తుండగా, బేగంబజార్ కార్పొరేటర్ కార్పొరేటర్ జి శంకర్ యాదవ్, బీజేపీ నాయకులు ఎం కృష్ణ తనపై దాడికి పాల్పడ్డారని, గోషామహల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.