
శంషాబాద్ రూరల్, డిసెంబర్ 20 : వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని నర్కూడలో జడ్పీ ఫ్లోర్‌లీడర్ నీరటి తన్విరాజు, మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. నిరసనలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పకాశ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డివిరుస్తుందని విమర్శించారు. రెండు సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్రమోదీ రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేసే వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాడి న్యాయం చేయాలని సూచించారు. జడ్పీ ఫ్లోర్‌లీడర్ నీరటి తన్విరాజు మాట్లాడుతూ రైతులేనిదే రాజ్యం లేదన్నారు. మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, ఎంపీపీ జయమ్మశ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం ముందుకు సాగలేదని అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వానికి రైతులు, ప్రజలు తగ్గిన బుద్ధి చెప్పాలన్నారు.
కార్యక్రమంలో సీనియర్ నాయకుడు గణేశ్‌గుప్త, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దండుఇస్తారి, పీఏసీఎస్ చైర్మన్లు దవాణాకర్గౌడ్, సతీశ్, సర్పంచ్‌లు రమేశ్‌యాదవ్, రాజ్‌కుమార్, సతీశ్‌యాదవ్, రాంగోపాల్, పార్టీ ప్రధాన కార్యదర్శి మంచర్ల మోహన్‌రావు, మాజీ ఎంపీటీసీ మోహన్‌నాయక్, ఉప సర్పంచ్ ఆంజనేయులుగౌడ్, ఎంపీటీసీ యాదగిరి, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.