మెహిదీపట్నం, డిసెంబర్ 25 ; తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఇండియన్ జాతీయ మోటార్ సైకిల్ డ్రాగ్ రేసింగ్ చాంపియన్ షిప్లో జరిగిన పోటీల్లో నగరంలోని మెహిదీపట్నంకు చెందిన బైక్ రేసర్ మహ్మద్ రియాజ్ ఉత్తమ ప్రతిభ కనబర్చి విజేతగా నిలిచాడు. ఈ నెల 23,24న చెన్నైలో ఉన్న మద్రాస్ అంతర్జాతీయ సర్క్యూట్లో జరిగిన నాలుగు రౌండ్లలో అత్యుత్తమ టైమింగ్తో సూపర్ స్పోర్ట్స్ విభాగంలో క్లీన్ స్వీప్తో విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా మహ్మద్ రియాజ్ మాట్లాడుతూ తన తండ్రి మహ్మద్ యూసుఫ్, తనను ప్రోత్సహించిన అందరికీ రుణపడి ఉంటానని తెలిపారు.