మియాపూర్, ఆగస్టు 15: 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఐఏయూవైఎస్ఏ ఆధ్వర్యంలో 15కిలో మీటర్ల సైకిల్ రైడ్‌ను గచ్చిబౌలిలోని ఏహెచ్బీసీ వద్ద ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగంగా దేశభక్తిని పెంపొందించడానికి ఐఏయూవైఎస్ఏ బృందం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 150 మంది సైక్లిస్ట్‌లు ఉత్సాహంగా పాల్గొని హైటెక్‌సిటీ, గచ్చిబౌలి మీదుగా ఐకియా బయోడైవర్సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ గుండా సైక్లింగ్ ర్యాలీని నిర్వహించారు. స్మార్ట్ ఐఎంఎస్ సంస్థ నిర్వాహకులు నగేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువ ప్రాతినిథ్యం పెంచడమే లక్ష్యంగా సంస్థ కృషి అభినందనీయమన్నారు. అనంతరం పేదలకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.