చిక్కడపల్లి, అక్టోబర్ 26: దేశ ఆర్థిక అభివృద్ధిలో కాస్ట్, మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ కీలక పాత్ర పోషిస్తుందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బిభూతి భూషణ్ నాయక్ తెలిపారు. దోమలగూడలోని సీఎంఏ భవన్లో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వక్యవస్థలో కాస్ట్, మేనేజ్మెంట్ అకౌంటెంట్స్(సీఎంఏ) పాత్రపై మీడియా సమావేశాన్ని శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బిభూతి భూషణ్ నాయక్ మా ట్లాడుతూ, కాస్ట్ మేనేజ్మెంట్, ఆడిటింగ్, ఫైనాన్సియల్ కన్సల్టెన్సీలో అవసరమైన నైపుణ్యాన్ని అందించడం, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ నిపుణుల అభివృద్ధిని పెంపొందించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి దోహపపడే సుదీర్ఘ చరిత్ర ఈ సంస్థకు ఉందన్నారు. కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ పా త్ర పూర్తిగా మారిపోయిందన్నారు. ఐసీఎంఏఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ కేసీహెచ్ ఏవీఏస్ మూర్తి మాట్లాడుతూ, విధానకర్తలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, సంస్థలకు తక్కువ ఖర్చు తో కూడిన వ్యూహాలు, వ్యవస్థలు, మాన్యువల్స్ రూపొందించడంలో సహాయం అందిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఐసీఎంఏఐ చాప్టర్ చైర్పర్సన్ డా.లావణ్య పాల్గొన్నారు.