మేడ్చల్, డిసెంబర్18: మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బసురాది భాస్కర్ యాదవ్ నియామకమయ్యారు. స్వరాష్ట్రంలో ఉద్యమ నేతలకు తగిన ప్రాధాన్యతనిస్తున్న సీఎం కేసీఆర్ సారధ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం భాస్కర్ యాదవ్‌కు అవకాశం కల్పించింది. తెలంగాణ రాక ముందు జరిగిన ఉద్యమాల్లో ఆయన మేడ్చల్ ప్రాంతంలో ముందుండి పోరాటం చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన అధిష్ఠానం భాస్కర్ యాదవ్‌ను మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎంపిక చేసింది.
ఈ మేరకు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో ఆదివారం మంత్రి నిరంజన్‌రెడ్డి భాస్కర్ యాదవ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్ ఉన్నా రు. ఈ సందర్భంగా భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ ఉద్యమ నేతగా గుర్తింపునిస్తూ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి మల్లారెడ్డి సహకారంతో తనకు ఈ పదవి దక్కిందన్నారు. మార్కెట్ చైర్మన్‌గా రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.