అలల తీరం..బతుకమ్మ రాగం..

- ట్యాంక్‌బండ్‌పై సండే ఫన్డే
- బతుకమ్మలు, సంప్రదాయ దుస్తులతో తరలివచ్చిన మహిళలు
- పూల పాటలకు జతకలిసిన లేజర్ షో.., బాణాసంచా కాంతులు
- జోష్‌తో ఆడిపాడిన నగర వాసులు, స్టెప్పులేసిన యువత
- ప్రత్యేక ఏర్పాట్లు చేసిన హెచ్ఎండీఏ అధికారులు
ప్రతి ఆదివారం సాయంత్రం సరదాగా కాసేపు.. సందడిగా మారుతున్న సాగర తీరం ఈ ఆదివారం పూల పండుగకు వేదికైంది. ఓ వైపు మహిళలు సంప్రదాయ దుస్తులతో
బతుకమ్మలతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. బతుకమ్మ ఆట పాటలతో హోరెత్తించి సందడి చేశారు. మరో వైపు లేజర్ షో.. బాణా సంచా కాంతులు ట్యాంక్‌బండ్‌ను సంబురాల్లో ముంచేశాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. ఒక్కేసి పువ్వేసి చందమామ.. చిత్తూ.. చిత్తూల బొమ్మ.. పాటలకు యువత సైతం స్టెప్పులేస్తూ సందడి చేసింది. ఈ ఆదివారం నగర వాసులకు బండ్ పరిసరాలు నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపాయి
చిత్తూ చిత్తూల బొమ్మ.. సాగర్ మురిసేనమ్మా..!
‘సండే.. ఫన్డే’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారాయి. బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందుకు హెచ్ఎండీఏ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఒకేసారి వేలాది మంది మహిళలు హాజరయ్యే బతుకమ్మ వేడులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా మధ్యాహ్నం 3 గంటల నుంచే ట్రాఫిక్‌ను లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా మళ్లించారు.
బతుకమ్మలతో బృందాలుగా వచ్చే మహిళలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. బతుకమ్మలతో పాటు సండే ఫన్డేలో భాగంగా దాండియా, గార్బా వంటి సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించారు. మొక్కల పంపిణీ, ఫుడ్ స్టాల్స్, హ్యాండీ క్రాప్ట్స్, హ్యాండ్ లూమ్స్, బాణా సంచా కాంతులు, లేజర్ షో నిర్వహించడంతో ట్యాంక్‌బండ్‌పైకి వచ్చిన వారంతా సరదాగా గడిపారు. టెస్కో హ్యాండ్లూమ్ స్టాల్స్, ఫుడ్ కోర్టులు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

