సిటీబ్యూరో, సెప్టెంబరు 14 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధ్దమైంది. జీహెచ్ఎంసి పరిధిలో 30సరిళ్లు 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం ద్వారా ఈనెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు పంపిణీ జరుగనున్నది. 624 రేషన్ షాపుల్లో 8 లక్షల 94 వేల 871 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. 9 లక్షల 2 వేల 84 చీరలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత సంవత్సరం 5 లక్షల 76 వేల 161 చీరలను పంపిణీ చేశారు. ఈ మేరకు గౌడౌన్ల నుంచి ఆయా సర్కిల్‌ల్లో పంపిణీ చేయనున్న ప్రాంతాలకు ఈ చీరలను తరలిస్తున్నారు. తెల్లరేషన్‌కార్డు ఉండి, 18 సంవత్సరాలు పూర్తి అయిన మహిళలకు వీటిని పంపిణీ చేయనున్నారు.
సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లో నేతన్నలతో చేయించిన 240పై చిలుకు వివిధ వెరైటీ డిజైన్లతో చీరలు తయారు చేయించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా వీటిని ఆడపడుచులకు పంపిణీ చేయనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 150 వార్డుల స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా మంత్రులచే ఈ చీరలను పంపిణీ చేసేందుకు అన్ని సిద్ధం చేశారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో కావాల్సిన చీరలు గోడౌన్లో నిల్వ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
సరూర్‌నగర్ మున్సిపల్ ఆఫీస్, ముసారాంబాగ్ సిరిపురం స్పోర్ట్స్ కాంప్లెక్స్, కలాందర్ నగర్ కమ్యూనిటీ హాల్, ఉప్పుగూడ, సాయిబాబ నగర్ కమ్యూనిటీ హాల్, మొఘల్‌పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్ , చందులాల్ బండారి స్పోర్ట్స్ కాంప్లెక్స్ , ఎల్ఐసీ పార్క్ కమ్యూనిటీ హాల్, లంగర్‌హౌజ్ హరిదర్శ్పుర కమ్యూనిటీ హాల్, ఫిరోజ్ గాంధీ పార్క్ ఈఎన్టీ దవాఖాన కోఠి, జవహర్‌నగర్ కమ్యూనిటీ హాల్, కాచిగూడ వార్డు ఆఫీస్ , సనత్‌నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట స్విమ్మింగ్ ఫూల్, బంజారాహిల్స్ సీఎంటీసీ గౌడౌన్, ఎర్రగడ్డ, బోరబండ కమ్యూనిటీ హాల్, లాలాపేట ప్రొ.జయశంకర్ స్టేడి యం, లాలాపేట ప్రొ.జయశంకర్ స్టేడియం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు.