ఆడబిడ్డలకు ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 8,90,019 చీరలను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు గోదాముల నుంచి ఆయా సర్కిల్‌ల్లో పంపిణీ చేయనున్న ప్రాంతాలకు ఈ చీరెలను తరలిస్తున్నారు. ఈ మేరకు అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ చీరలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక కార్పొరేటర్లు పంపిణీ చేయనున్నారు. తెల్లరేషన్‌కార్డు ఉండి, 18 సంవత్సరాలు పూర్తి అయిన మహిళలకు వీటిని తీసుకునేందుకు అర్హులు. నేతన్నలకు ఉపాధి కల్పించడంతో పాటు ఆడబిడ్డలకు కానుకగా ప్రభుత్వం ప్రతి ఏటా ఆకర్షణీయమైన రంగుల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.