కాప్రా/మల్లాపూర్, జులై 24: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ సుభాష్‌నగర్‌కు చెందిన వికలాంగ యువకుడు వేముల రమేష్ (37)కు బీఎల్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి రూ.లక్షా ముప్పైవేల విలువైన బైక్‌ను అందజేసి తన సహృదయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా బీఎల్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం మెచ్చిన నాయకుడిగా, దేశం హర్షించే నేతగా మంత్రి కేటీఆర్ జన నీరాజనాలు అందుకుంటున్నారని, ఆయన పుట్టిన రోజు సందర్భంగా తాను ఈ పుణ్యకార్యం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మెడిసిన్ చదివే పేద విద్యార్థిని, ఆటో డ్రైవర్ నరసింహ కూతురు గీతాంజలికి ఉచితంగా ఫీజు చెల్లించే క్రమంలో వారి ఇంటికి వచ్చిన సుభాష్‌నగర్‌కు చెందిన వికలాంగ యువకుడు వేముల రమేష్ తనను కలిసి తన పరిస్థితి వివరించాడని అన్నారు. నడవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్తున్నాననీ, బండి ఇప్పిస్తే ఏదైనా పని చేసుకోవడానికి వీలవుతున్నదని తెలుపడంతో ఆయనతో పాటు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి ఆసరాగా ఉండేందుకు మరో పది బైకులు బుక్ చేసినట్టు తెలిపారు. వీటిలో మొదటి బైక్‌ను కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా వేముల రమేష్‌కు అందజేస్తున్నందుకు తనకు ఎంతో సంతృప్తిగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి, కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ మల్లేష్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు సాయిజన్ శేఖర్, కటార్ల భాస్కర్, బీఎల్ఆర్ ట్రస్ట్ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
జీవితాంతం రుణపడి ఉంటా…
ఎన్నో ఏండ్లుగా ఇబ్బంది పడుతున్నా, కానీ, ఏ నాయకుడు కూడా నన్ను ఆదుకోలేదు. మంచి మనసున్న మారాజు బండారి లక్ష్మారెడ్డి తన సొంత నిధులతో బీఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా రూ.లక్షా ముప్పైవేల విలువైన వాహనం ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను.
– వేముల రమేశ్, సుభాష్‌నగర్