ఉప్పల్, మార్చి 13: బంగారు మైసమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (Bandari Lakshma Reddy) అన్నారు. గురువారం నాచారం డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్లో బంగారు మైసమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రేటర్ నాయకులు సాయి జెన్ శేఖర్, పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మహా లక్ష్మీ దేవి ప్రధమ వార్షికోత్సవం
ఉప్పల్ డివిజన్ పరిధిలోని న్యూ భరత్ నగర్లోని శ్రీ మహా లక్ష్మీ దేవి ప్రథమ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి కటాక్షం అందరి మీద వుండాలన్నారు. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ డివిజన్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.