పచ్చదనం పై వంతెన

బాలానగర్, సెఫ్టెంబర్ 4 : బాలానగర్ ఫ్లై ఓవర్ పరిసరాలు ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ైఫ్లై ఓవర్ పైన డివైడర్‌పై ఏర్పాటు చేసిన మొక్కలతో పాటు ఫ్లై ఓవర్ సరికొత్త వాతావరణాన్ని అందిస్తున్నది. ైఫ్లై ఓవ ర్ కింద కూడా పచ్చని మొక్కలు మరింత ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. ఒక పిల్లర్ నుంచి మరో పిల్లర్‌కు మధ్య ఉన్న స్థలాన్ని ఒక స్పాన్ అంటారు.
బాలానగర్ ఫ్లై ఓవర్‌కు మొత్తం 25 స్పాన్లు ఉన్నాయి. వాటిలో 17 స్పాన్లలో పచ్చని మొక్కల పెంపకం జరుగుతుంది. అదే విధంగా రెండు పిల్లర్లకు సైతం చిన్నపాటి పూల మొక్కల పెంపకం చేపట్టారు.
మరో రెండు స్పాన్లలో వాహనాల యూటర్న్ ఉంది. నర్సాపూర్ చౌరస్తాలోని రెండు స్టీల్ గడ్డర్లలో ఏర్పాటు చేసిన రెండు స్పాన్లు, టీ జంక్షన్లో ఏర్పాటు చేసిన మరో స్టీల్ గడ్డర్ వద్ద ఏర్పాటు చేసిన ఓ స్పాన్‌లో వాహనాల రాకపోకలకు అవకాశం కల్పిస్తున్నందున ఆయా ప్రాంతాలలో స్పాన్లలో మొక్కల పెంపకం చేపట్టలేదు. మిగిలిన రెండు స్పాన్లలో పనులు జరుగుతున్నందున అవి పూర్తి కాగానే వాటిలో కూడా మొక్కల పెంపకం చేపట్టడానికి సంబంధిత అధికారులు సన్నహా లు చేస్తున్నారు. బాలానగర్‌లో రూ. 387 కోట్ల నిధుల తో చేపట్టిన ైప్లెఓవర్ దూరం 1.13 కిలోమీటర్లు. ఇరువైపులా జిగేల్మనే ఎల్ఈడీ లైట్లనుఅమర్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- balanagar flyover
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

