హైదరాబాద్ : నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) నాయకుడు బల్మూరి వెంకట్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నివాసానికి తన అనుచరులతో వెళ్తుండగా వెంకట్‌ను పోలీసులు అడ్డుకొని, అదుపులోకి తీసుకున్నారు. అయితే వెంకట్ తన అనుచరులతో కలిసి శాంతి భద్రతల సమస్యలను సృష్టించేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో అతన్ని ముందస్తుగా అదుపులోకి తీసుకొని గోల్కొండ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వెంకట్‌ను విడుదల చేయాలని పోలీసులను జగ్గారెడ్డి కోరారు. పోలీసులు మాత్రం వెంకట్‌ను విడుదల చేయలేదు.