Bachupally | ఇండస్ట్రియల్ కాలుష్యాన్ని నివారించాలని బాచుపల్లిలో భారీ ర్యాలీ..
Bachupally | నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి, నిజాంపేట, ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇండస్ట్రియల్ కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలంటూ పలువురు నినదించారు.
Bachupally | దుండిగల్, మార్చి9 : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి, నిజాంపేట, ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇండస్ట్రియల్ కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలంటూ పలువురు నినదించారు. గత కొంతకాలంగా బాచుపల్లి, నిజాంపేట, ప్రగతి నగర్ ప్రజలు వాయు కాలుష్యాన్ని నివారించాలంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన స్పందన లేకపోవడంతో ఆదివారం బాచుపల్లిలో ఇండస్ట్రియల్ కాలుష్యానికి వ్యతిరేకంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండస్ట్రియల్ కాలుష్యానికి, పీసీబీ అధికారుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఫ్ల కార్డులు చేతబూని నినదిస్తూ కావ్య ఏవెన్యూ కమ్యూనిటీ హాల్ నుండి మల్లంపేట రోడ్‌లోని సిల్వర్ ఓక్స్ పాఠశాల మీదుగా బాచుపల్లి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఇండస్ట్రియల్ కాలుష్యం కారణంగా బాచుపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చడం కష్టతరంగా మారుతుందన్నారు. విషవాయువుల విడుదలతో రాత్రిపూట బయటకు వస్తే ముక్కుపుటాలు అదురుతున్నాయని పేర్కొన్నారు. బాచుపల్లి పరిసర ప్రాంతాల్లోని ఐడీఏ బొల్లారం, కాజిపల్లి, బొంతపల్లి, జిన్నారం తదితర ప్రాంతాల్లోనీ కొన్ని పరిశ్రమలు విచ్చలవిడిగా రాత్రి పొద్దుపోయిన తర్వాత, తెల్లవారి జామున హానీకారకమైన విషవాయువులను గాలిలోకి విడుదల చేస్తుండడంతో తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. ఈ విషయమై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఎన్ని మార్లు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న పరిశ్రమలను మూసివేసేదాకా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా పీసీబీ డౌన్.. డౌన్.. పీసీబీ జాగో పొల్యూషన్ బాగో, పీసీబీ అధికారులు మొద్దు నిద్ర వీడాలి, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలి, వి వాంట్ జస్టిస్, స్వచ్ఛమైన గాలి మా జన్మ హక్కు, పీసీబీ నిర్లక్ష్య వైఖరి నశించాలి, కాలుష్యం వెదజల్లుతున్న ఫ్యాక్టరీలను మూసివేయాలి అంటూ నినాదాలు చేశారు. ర్యాలీలో బాచుపల్లి, నిజాంపేట్ ప్రగతి నగర్ కు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | మాకే తాగడానికి నీళ్లు లేవు, మికేలా ఇస్తాం.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Avinash Reddy Arrest | కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..విడుదల
January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ‘దివికి దివికి’ ప్రోమో విడుదల!
VishwakSen | సంస్కారం వయసుతో పాటు పెరగాలి.. సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ ఫైర్!
Liver Detox | లివర్‌ను క్లీన్ చేస్తాయని చెప్పే చిట్కాలు, ఉత్పత్తులను నమ్మవచ్చా.. కాఫీ ప్రభావం లివర్‌పై ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

