హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : పోలీసులు అయ్యప్పమాల వేసుకుని విధులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమంటూ హైదరాబాద్ కంచన్బాగ్ పోలీస్స్టేషన్లో ఓ ఎస్సైకి ఉన్నతాధికా రులు మోమో జారీ చేయడంతో మొదలైన ఆందోళనలు కొనసాగుతున్నాయి. గురువారం అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాల నాయకులు డీజీపీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. ఎస్సైకి ఇచ్చిన మెమోను వెనకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, స్వాములకు వాగ్వాదం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీజీపీ కార్యాలయం దగ్గర భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. హిందూ సంఘాల నాయకులను అరెస్టు చేసి, వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇదే అంశంపై సౌత్ఈస్ట్ జోన్ కార్యాలయంలోనూ అయ్యప్ప భక్తులు నిరసనకు దిగారు.