రవీంద్రభారతి, సెప్టెంబర్ 24: ప్రాచీన లలిత, శాస్త్రీయ సంగీతాన్ని భావితరాలకు నాట్యగురువులు అవగాహన కల్పించాలని నీటిపారుదల శాఖ చైర్మన్ డాక్టర్ సముద్రాల వేణుగోపాలా చారి అన్నారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ వరల్డ్ రికార్డ్స్ , ఏబీసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన గురువందనం, కృష్ణాష్టమీ వేడుకల సందర్భంగా కూచిపూడి, భరత నాట్యప్రదర్శనలు ఘనంగా నిర్వహించారు.
భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ రమణారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సముద్రాల వేణుగోపాలా చారి, విశిష్ట అతిథిగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా హాజరై.. జ్యోతి ప్రజ్వలన చేసి పలువురి నాట్యగురువులకు అవార్డులను బహూకరించారు. అనంతరం డాక్టర్ సముద్రాల వేణుగోపాలా చారి మాట్లాడుతూ.. లలిత కళలు, ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు అందిస్తున్న లయన్ రమణారావు, లలితారావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కావ్య పాటిల్, కె.పావని, నాట్యగురువు జ్యోతి, జ్యోతిరెడ్డి, రవికుమార్, జ్యోతిరెడ్డి, మారుతీ వరుణ్, రాగిణి, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.