ఖైరతాబాద్, జూన్ 16: ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.263 నుంచి సీఎన్జీ, ఎల్పీజీ వాహనాలను మినహాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటో యూనియన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనియన్ నేత ఇబ్రహీం మాట్లాడుతూ గతేడాది ప్రభుత్వం జీవో నం.41ను తీసుకువచ్చిందని, తద్వారా డ్రైవర్లు అధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. తాజాగా 20వేల విద్యుత్ ఆటోలతో పాటు పది వేల సీఎన్జీ, మరో పది వేల ఎల్పీజీ వాహనాలకు సైతం పర్మిట్లు కల్పిస్తూ జీవో నం. 263ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ జీవోతో విద్యుత్ ఆటోలను వినియోగించుకోవాలనుకుంటున్న డ్రైవర్లకు తీరని నష్టం జరుగుతుందన్నారు.