వ్యవసాయ యూనివర్సిటీ (హైదరాబాద్) జూన్ 20: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్‌తో పాటు రాష్ట్రంలోని ప్రాంతీయ కేంద్రాల్లో హాస్టల్లో పనిచేయడానికి ఖాళీగా ఉన్న 20 అసిస్టెంట్ వార్డెన్స్ పోస్టులకు శుక్రవారం ఇంటర్వ్యూ నిర్వహించాల్సి ఉండగా, అధికారులు రెండు రోజుల ముందు వాయిదా వేశారు. విషయం తెలియని నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కార్యాలయం వద్ద అభ్యర్థులకు ఇంటర్వ్యూ వాయిదా వేసినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలుపడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇంటర్వ్యూ వాయిదా వేయడంతో ఆందోళనకు దిగారు. కాగా, త్వరలోనే తేదీ ప్రకటించి.. పోటీ పరీక్ష నిర్వహించి.. అర్హులను ఎంపిక చేస్తామని రిజిస్టర్ విద్యాసాగర్ తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హతగల వారు పరీక్షకు హాజరుకావాలని సూచించారు.