ఆర్కేపురం : కొత్తపేట వాసవి కాలనీలోని అష్టలక్ష్మీ దేవాలయ 26వ బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఉదయం ధ్వజారోహణ , శేష వాహన సేవ, సుదర్శన ఇస్టి వాహన కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు రాఘవాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ గౌరిశెట్టి చంద్రశేఖర్గుప్త, చైర్మన్ బందం దామోదర్గుప్త, ప్రధాన కార్యదర్శి గంగ జగన్, కోశాధికారి ఐత అంజయ్యగుప్త, బ్రహ్మోత్సవాల కమిటీ కన్వీనర్ దాచేపల్లి శ్రీనివాస్, మాజీ చైర్మన్ మ్యాడం సుధాకర్, పూజ కమిటీ చైర్మన్ మురిగేశన్, గౌరిశెట్టి అరుణ తదితరులు పాల్గొన్నారు.