బంజారాహిల్స్,జూన్ 9: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపట్ల ఎంఐఎమ్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర సంతాపం ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన అసదుద్దీన్ తనకు మాగంటి గోపీనాథ్ చాలా ఏళ్లుగా పరిచయం ఉందని, హైదర్‌గూడలో ఒకే ఏరియాలో ఉండేవాళ్లమని పేర్కొన్నారు. మాగంటి కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు.
పార్టీ తరపున ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, పార్టీ నేత అన్వర్ సాదిక్ మాగంటి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరమార్శించారని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఎంఐఎమ్ అభ్యర్థిని నిలబెట్టే అంశాన్ని పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.