సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): వేసవి శిక్షణ శిబిరాలకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. వచ్చే వారంలో పాఠశాలలకు సెలవులు వస్తుండటంతో ప్రతి యేటా మాదిరిగానే చిన్నారులకు క్రీడా నైపుణ్యతను పెంపొందించుకొనేందుకు ఈ నెల 25 నుంచి మే 31వ తేదీ వరకు సమ్మర్ కోచింగ్ కా్ంయపులను నిర్వహించనుంది. ఈ మేరకు తేదీల వారీగా షెడ్యూల్ ప్రకటించారు. ఔట్‌డోర్, ఇండోర్ స్పోర్ట్స్‌తో పాటు పెయింటింగ్ తదితర మనోవికాసాన్ని పెంచే ఫన్నింగ్ గేమ్స్ కలిపి మొత్తం 44 రకాల క్రీడలపై శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే జోన్ల వారీగా క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ ఆన్లైన్ ద్వారా ఆయా క్రీడలకు సంబంధించి రుసుమును వసూలు చేస్తున్నారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, గేమ్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షణలో ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి.