Ramakrishna Math | సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, జపానీస్, స్పానిష్, హిందీ, స్పోకెన్ ఇంగ్లిష్ తదితర భాషలను నేర్చుకోవడానికి మంగళవారం నుంచి ఈనెల 31 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రామకృష్ణమఠం నిర్వాహకులు తెలిపారు.
ఆన్లైన్, ఆఫ్లైన్ తరగతులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య దోమలగూడలోని ఆర్కే మఠ్ను లేదా 9603578545 వాట్సాప్ నంబర్లో కూడా సంప్రదింవచ్చని సూచించారు.
ఫైర్, సేఫ్టీ కోర్సుల శిక్షణకు దరఖాస్తులు..
నేషనల్ సెంటర్ ఫైర్, సేఫ్టీ, ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఫైర్, సేఫ్టీ కోర్సులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ అడపా వెంకట్రెడ్డి తెలిపారు.
కాచిగూడలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు పేరొందిన ఎయిర్ పోర్ట్, అయిల్ కంపెనీలు, గ్యాస్ ఇండస్ట్రీస్, స్టార్ హోటల్స్, ఫార్మా ఇండస్ట్రీస్, రైల్వే, వివిధ కార్పొరేట్ సంస్థలలో అవకాశాలు పొందవచ్చని వెల్లడించారు. ఈ కోర్సులలో చేరేందుకు ఇంటర్, డిప్లమా, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ అభ్యర్థులను అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి గల యువకులు వచ్చే నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు www.ncttindia.com. లేదా ఫోన్ నం. 63023 55872లో సంప్రదించాలని కోరారు.