Another underpass | ట్రాఫిక్ ఫ్రీ ప్రయాణం కోసం ఎల్బీనగర్లో అందుబాటులోకి మరో అండర్‌పాస్ : ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
ఎల్బీనగర్ : ట్రాఫిక్ ఫ్రీ ప్రయాణం కోసం ఎల్బీనగర్ జంక్షన్లో మరో అండర్‌పాస్ అందుబాటులోకి వచ్చిందని, త్వరలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.
శుక్రవారం ఎల్బీనగర్ జంక్షన్లో ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా ఇన్నర్ రింగ్‌రోడ్డు నుండి సాఫీగా ప్రయాణం కోసం నిర్మాణం పూర్తి చేసుకున్న మరో అండర్‌పాస్ ను ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ది విషయంలో రాబోయే రోజుల్లో ఎల్బీనగర్ రూపురేఖలు మారిపోతాయన్నారు.
ఇన్నర్ రింగ్‌రోడ్డులో ఎల్బీనగర్ జంక్షన్లో ఇరువైపులా సాఫీగా ప్రయాణం కోసం రెండు అండర్‌పాస్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పటికే ఎడమవైపు అండర్‌పాస్ ద్వారా ఇరువైపులా ప్రయాణాలు సాగుతున్నాయని, కుడివైపు అండర్‌పాస్ కూడా అందుబాటులోకి వస్తే ఇబ్బంది లేకుండా ప్రయాణికులకు అనువుగా ఉంటుందన్నారు.
ఎల్బీనగర్ జంక్షన్‌తో పాటుగా బైరామల్‌గూడ జంక్షన్ వద్ద ఫ్లె, స్కై ఓవర్ పనులు కూడా యుద్ద ప్రాతిపదికన సాగుతున్నాయని అన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

