రూ.40 లక్షలతో నిర్మాణం
ప్రారంభానికి సిద్ధం..
ఘట్కేసర్,మే 15 : ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన అంగన్వాడీ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. అంగన్వాడీ అల్వాల్ ప్రాజెక్టులో భాగంగా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో దాదాపు రూ.40 లక్షల మున్సిపాలిటీ సాధారణ నిధులతో మోడల్ భవనం తీర్చిదిద్దారు. ఘట్కేసర్ మండల స్థాయిలో అంగన్వాడీ టీచర్లు, తల్లులు, పిల్లల సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా విశాలమైన హాల్, కిచెన్, స్టోర్‌రూం, రికార్డు రూం, టాయిలెట్స్‌ను ఈ భవనంలో ఏర్పాటు చేశారు. అంగన్వాడీ అల్వాల్ ప్రాజెక్టు కింద మేడిపల్లి, ఘట్కేసర్, అల్వాల్, మల్కాజిగిరి, కాప్రా, ఉప్పల్ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ భవనాల కంటే ఈ భవనంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు.
పిల్లలకు ఆహ్లాదాన్ని అందించే విధంగా..
ప్రారంభానికి సిద్ధమైన అన్నోజిగూడ అంగన్వాడీ భవనం పిల్లలకు ఆహ్లాదాన్ని పంచే విధంగా రూపుదిద్దుకున్నది. పిల్లలకు విజ్ఞానాన్ని అందించే అన్ని రకాల బొమ్మలను చిత్రీకరించారు.
అన్ని సౌకర్యాలతో నిర్మించాం..
పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో నిర్మించిన అంగన్వాడీ భవనం అన్ని సౌకర్యాలతో అధునాతనంగా తీర్చిదిద్దాం. ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తయాయి. త్వరలో మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం.
-బి.కొండల్‌రెడ్డి,పోచారం మున్సిపాలిటీ చైర్మన్