Hyderabad Road | అది నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు వెంట టూవీలర్, ఫోర్ వీలర్స్తోపాటు ఇతర వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. అలాంటి మెయిన్ రోడ్డు రోజురోజుకీ దారుణంగా తయారవుతోందని అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబర్పేట్ గాంధీబొమ్మ వద్ద ఫ్లైఓవర్ కింద రోడ్డు గుంతలతో నిండిపోయిన దృశ్యాలు హైదరాబాద్ నగరంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెబుతున్నాయి.
ప్రతిరోజూ 5-6 మంది ప్రమాదాలకు గురవుతున్నారని.. ఇది ప్రధాన రహదారి అయినప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు. నడి రోడ్డుపై నడ్డి విరుగుతోందంటూ ఈ మార్గంలో వెళ్తున్న ప్రయాణికులతోపాటు స్థానికులు వాపోతున్నారు. ఫ్లైఓవర్ కింద భాగం మొత్తం గుంతలమయంగా మారింది.
మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి రామంతాపూర్ వైపు వెళ్లే మార్గంలో ఎక్కడా సరైన రోడ్డు లేదు. ఈ రోడ్డు పరిస్థితి రోజురోజుకీ దారుణంగా తయారవుతుందని అధికారులు పట్టించుకొని మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
ఇదీ హైదరాబాద్ రోడ్ల దుస్థితి!
నడిరోడ్డున నడ్డి విరుగుతోంది!
అంబర్పేట్ గాంధీబొమ్మ వద్ద ఫ్లైఓవర్ కింద రోడ్డు పరిస్థితి రోజురోజుకీ దారుణంగా తయారవుతుందని స్థానికులు తీవ్ర ఆవేదన
ప్రతిరోజూ ఐదు నుంచి ఆరు మంది వరకు ప్రమాదాలకు గురవుతున్నారని, ఇది మెయిన్ రోడ్ అయినప్పటికీ ఎందుకు… pic.twitter.com/sDRojs76VP
— Telugu Scribe (@TeluguScribe) April 1, 2026