హైదరాబాద్లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఏది అంటే టక్కున గుర్తుకు వచ్చేది.. నగరానికి పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్. అలాంటి ఐటీ కారిడార్ కేంద్రంగా నిత్యం లక్షలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారంటే ఐటీ రంగంలో జరిగిన అభివృద్ధే అందుకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన సమయంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 3.32 లక్షలు ఉండగా, తొమ్మిదిన్నరేండ్లలో ఆ సంఖ్య 10 లక్షలకు చేరింది.
అలాగే ఐటీ ఎగుమతులు 2014 నాటికి రూ.57వేల కోట్లు ఉండగా, 2023 నాటికి రూ.2.41 లక్షల కోట్లకు చేరాయంటే ఐటీ రంగంలో ఎవరూ ఊహించని స్థాయిలో జరిగిన అభివృద్ధేనని ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ రంగంపై చూపిన ప్రత్యేక చొరవతోనే ఐటీ రంగం గణనీయమైన వృద్ధి సాధించింది. దీంతో ఐటీ ఉద్యోగులతోపాటు ప్రజలు తెలంగాణ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు.
– సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ)